తెదేపా కార్యాలయంపై దాడి కేసు..

ప్రధానాంశాలు

తెదేపా కార్యాలయంపై దాడి కేసు..

పోలీసుల అదుపులో వైకాపా కార్పొరేటర్‌

ఈనాడు, అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. గుంటూరు 21వ డివిజన్‌ వైకాపా కార్పొరేటర్‌ కాండ్రుకుంట గురవయ్యతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అర్బన్‌ పోలీసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురవయ్య తొలి నుంచీ వైకాపా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అనుయాయుడు. ఈ ఏడాది నగరపాలికకు జరిగిన ఎన్నికల్లో ఆయనకు వైకాపా అభ్యర్థిత్వం దక్కలేదు. స్వతంత్రంగా పోటీ చేసి, గెలుపొందాక వైకాపాలో చేరారు. దాడి కేసులో గుంటూరుకే చెందిన బంక సూర్య సురేష్‌, కల్లా మోహన్‌కృష్ణారెడ్డి, విజయవాడకు చెందిన జోగిరాజు, ఎస్‌కే బాబు, ఎస్‌కే సైదాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా శని, ఆదివారంతో కలిపి 16 మందిని పట్టుకున్నారు. నిందితులను గుర్తించడానికి నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజీలను విశ్లేషించేందుకు ఐటీ కోర్‌ బృందాలు పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పట్టాభి ఇంటిపై దాడి కేసులో మరో ఏడుగురికి నోటీసులు

పటమట, న్యూస్‌టుడే: తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపై జరిగిన దాడి కేసులో మరో ఏడుగురికి 41ఏ కింద నోటీసులు జారీ చేసినట్లు విజయవాడ పటమట పోలీసులు ఆదివారం తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు, సీసీ కెమెరాల ఆధారంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగపు చెన్న కేశవరావు, మేడిశెట్టి రాజశేఖర్‌, సొంగా చందన్‌, ఇట్ల సురేష్‌, శిఖ రంజిత్‌కుమార్‌, నామవరపు యశోద, మెరకనపల్లి ఆదిలక్ష్మిని గుర్తించామన్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందికి నోటీసులిచ్చినట్లు పటమట సీఐ రావి సురేష్‌రెడ్డి తెలిపారు

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని