నటి సమంతకు ఊరట

ప్రధానాంశాలు

నటి సమంతకు ఊరట

ఆమె వ్యక్తిగత విషయాలను ఎవరూ ప్రసారం చేయరాదన్న కోర్టు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటి సమంతకు కూకట్‌పల్లి కోర్టులో ఊరట లభించింది. ఆమె వ్యక్తిగత వివరాలను ఎవరూ ప్రసారం చేయకూడదని, యూట్యూబ్‌ ఛానళ్లలో ఇప్పటికే ఉన్న సంబంధిత వీడియోలను, ఇతర లింకులను తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది. సమంత సైతం తన వ్యక్తిగత వివరాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకూడదని సూచించింది. సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేశారంటూ డాక్టర్‌ సీఎల్‌ వెంకట్రావుతోపాటు సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీ యూట్యూబ్‌ ఛానళ్లపై సమంత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. వాదనల అనంతరం న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని