రబీ వరికి ప్రత్యామ్నాయాలివిగో..!

ప్రధానాంశాలు

రబీ వరికి ప్రత్యామ్నాయాలివిగో..!

టీవల కేంద్ర ప్రభుత్వం దొడ్డుగింజ వరి రకాల సాగును తగ్గించాలని సూచిస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. సాధారణంగా ఖరీఫ్‌లో సన్నగింజ, రబీ (యాసంగి)లో దొడ్డుగింజ వరి రకాలను సాగుచేయడం పరిపాటి. యాసంగిలో తెలంగాణలో ఉత్పత్తి చేసిన దొడ్డుగింజ వరి రకాలను భారత ఆహార సంస్థ కొనుగోలు చేసి తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం సరఫరా చేసేది. కాని ప్రస్తుతం ఆ రాష్ట్రాలు కూడా వరి ఉత్పాదకతలో స్వయం సమృద్ధిని సాధించడంతో రాబోయే నాలుగేళ్ల వరకు సరిపడే ఆహార ధాన్యపు బఫర్‌ నిల్వలు ఉండటం వల్ల భారత ఆహార సంస్థ ఈ యాసంగి వరిని కొనుగోలు చేయలేమని నిర్ద్వందంగా స్పష్టం చేసింది. ఈ సమయంలో రైతులు వరికి బదులుగా ఎలాంటి పంటలు సాగుచేసుకోవాలి? అందుకు అనువైన రకాలు ఏమేమి ఉన్నాయి? వాటి విత్తనాలు ఎక్కడ లభిస్తాయి? జీరోటిల్లేజి పద్ధతిలో ఏ రకమైన పంటలు పండించుకోవచ్చు? రబీలో తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే ఆరుతడి పంటలు ఏమున్నాయి? దేశీయ అవసరాల కోసం విదేశాల నుంచి అధిక మొత్తంలో నూనెలను దిగుమతి చేసుకుంటున్న వేళ నూనెగింజల సాగు రబీలో రైతుకు లాభదాయకమేనా? ఏయే పప్పుధాన్య పంటలను సాగుచేసే అవకాశముంది? పశుగ్రాస పంటలను సాగుచేస్తే రైతుకు గిట్టుబాటు అవుతుందా? ఏయే కూరగాయ పంటలు సాగుచేసుకోవచ్చు? పచ్చిరొట్ట పైర్లను విత్తనోత్పత్తి కోసం సాగుచేస్తే రైతుకు కలిగే లాభాలేమిటి వంటి మరిన్ని వివరాలను నవంబరు ‘అన్నదాత’ మీకు అందిస్తోంది.

మరెన్నో ఆసక్తికర కథనాలు అన్నదాత నవంబరు-2021 సంచికలో...
‘అన్నదాత’ చందాదారులుగా చేరడానికి సంప్రదించాల్సిన ఫోన్‌ నెం: 9121157979, 8008522248
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని