close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మూడు ముక్కలాటతో మరో గుండె ఆగింది

మూర్ఖత్వానికి మానవ రూపం జగన్‌. 79 మంది రైతులను పొట్టన పెట్టుకున్నా అహం చల్లారలేదు. 14 నెలల్లో ఏ ప్రాంతంలోనూ ఒక్క ఇటుక పెట్టని జగన్‌ 3 రాజధానులు నిర్మిస్తానంటూ హింసించే రాజు పులికేసిని తలపిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం మూడు ముక్కలాటతో మరో మహిళా రైతు గుండె ఆగింది.

- తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

* మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ ఆమోదించడాన్ని ఖండిస్తున్నా.   

-కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు

*  గత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌ అమరావతినే రాజధానిగా ఉంచాలని చెప్పి సీఎం అయ్యాక మాట మార్చడం ఎంతవరకు సమంజసం?

-మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

*  బిల్లులను ఆమోదించి గవర్నర్‌ రాష్ట్రాన్ని నిలువునా కాల్చేశారు. కేంద్రంలోని భాజపా సైతం దీనికి సహకరించి ప్రజల ఆశలను నీరుగార్చింది. కరోనా వల్లే ప్రజలు ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు వెనకాడుతున్నారు. వారు ఈ అంశాన్ని వదిలిపెట్టబోరన్నది గుర్తుపెట్టుకోవాలి.

-మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

*  అమరావతిని నమ్మి భూములు త్యాగం చేసిన రైతులది తప్పా? మంచి రాజధాని వస్తే భవిష్యత్తు బాగుంటుందని నమ్మి రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టినవారిది తప్పా? రూ.పది వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన భవనాలను ఎందుకు శిథిలాలుగా మార్చేస్తున్నారు?

- మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

*  రద్దు బిల్లులపై కోర్టుల్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చి 14 నెలలైనా చంద్రబాబుపై, ఆయన కుటుంబీకులపై నిందలు వేయడం తప్ప నిరూపించింది లేదు.

-మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు

*  రాజధాని అమరావతి విషయంలో భాజపా వైఖరి గోడ మీద పిల్లిలా ఉంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో భాజపా రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. ఇప్పటికైనా కేంద్రం చొరవ తీసుకుని రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చూడాలి.

-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.