close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జగన్‌ రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించుకుంటున్నారు: యనమల

ఈనాడు డిజిటల్‌- అమరావతి: సీఎం జగన్‌ ఎంత అహంభావంతో వ్యవహరించారో చెప్పడానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలే నిదర్శనమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పుతోనైనా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌పై ఉందని స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేలా ఎస్‌ఈసీ చూడాలన్నారు. సోమవారం యనమల వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘సీఎం తనకు తానే రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించుకుంటున్నారు. నోటిఫికేషన్‌ ఇచ్చాక విధుల్లో పాల్గొనబోమని ముఖ్యమంత్రి, ఉద్యోగులు చెప్పిన దాఖలాల్లేవు. జగన్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని’ మండిపడ్డారు.

‘వైకాపా నేతలా.. వెంకట్రామిరెడ్డి తీరు’
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఆయన సతీమణి శ్వేతారెడ్డి 2014 ఎన్నికల్లో వైకాపా తరఫున ప్రచారం చేశారని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలోని ముషీరాబాద్‌ శాసనసభ స్థానం నుంచి వెంకట్రామిరెడ్డికి వైకాపా అభ్యర్థిత్వం ఖరారైందని, ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆఖరు నిమిషంలో పోటీ నుంచి విరమించుకున్నారని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన వైఖరి ఉద్యోగ సంఘం నేతలా కాకుండా వైకాపా నేతలా ఉంటోందని విమర్శించారు.

సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాల నేతలు నిలదీయరా?: పట్టాభి
అధికారంలోకొచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తానన్న జగన్‌ను నిలదీయడానికి ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు ధైర్యం చేయడం లేదని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ప్రశ్నించారు. ఉద్యోగుల సీపీఎస్‌కు సంబంధించిన సొమ్మును జగన్‌ ప్రభుత్వం జమ చేయకపోతుంటే, ఉద్యోగ సంఘాల నేతలు ఏం చేస్తున్నారని నిలదీశారు. సోమవారం మంగళగిరిలో పట్టాభి విలేకర్లతో మాట్లాడారు. ‘కొద్ది నెలల కిందటే అందిన పీఆర్‌సీ నివేదికను ప్రభుత్వం తొక్కిపెట్టినా ఎందుకు నిలదీయరు? అని ప్రశ్నించారు.

విధి నిర్వహణకు కట్టుబడిన ఎస్‌ఈసీ

- కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ రాజ్యాంగ విధి నిర్వహణకు గట్టిగా నిలబడ్డారు. ప్రభుత్వమే మొండిగా వ్యవహరిస్తూ ఎన్నికలు వాయిదా వేయడానికి యత్నించింది. హైకోర్టు, సుప్రీంకోర్టులు ఎన్నికలు జరగాల్సిందేనని చెప్పడంతో ఈ వివాదానికి పరిష్కారానికి లభించింది. ఇరువర్గాలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలి. ఉద్యోగ సంఘాల వ్యవహారశైలి విమర్శలకు గురైనా ప్రభుత్వం, ఎస్‌ఈసీతో కలిసి పని చేయాలి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు