close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సొంతూళ్లో గెలిచినా సంబరాలా: మంత్రి అనిల్‌

ఈనాడు, అమరావతి: చంద్రబాబు సొంతూరులో వార్డులు గెలిచినందుకే తెదేపా నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని జల వనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. 2024 నాటికి నియోజకవర్గాల్లో అయిదో, పదో పోలింగ్‌బూత్‌లలో ఆధిక్యం సాధించాం అని సంబరాలు చేసుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోతారని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెదేపాకు వచ్చిన 15, 16శాతం పంచాయతీలు కూడా వైకాపా రెబల్స్‌ పోటీలో ఉన్నందువల్లే వచ్చాయన్నారు.  విలేకరుల ప్రశ్నలకు మంత్రి సమాధానిమిస్తూ మంత్రుల వల్ల నిజంగా ఎక్కడైనా వైకాపాకు ఓట్ల శాతం తగ్గి ఉంటే సమీక్షించుకొని సరిదిద్దుకుంటామని చెప్పారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు