close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
80.5% పంచాయతీలు మావే

ఎన్నికలు సజావుగా జరిగితే 90% పైనే గెలిచేవాళ్లం
పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రవ్యాప్తంగా 13,081 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 80.5% అంటే 10,536 పంచాయతీల్లో వైకాపా మద్దతుదారులు గెలిచారు. ఎన్నికలు సజావుగా జరిగితే 90% పైనే స్థానాల్లో గెలిచివాళ్లం’ అని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2,100 పంచాయతీల్లోనే తెదేపా మద్దతుదారులు గెలిచారని.. 445 పంచాయతీల్లో భాజపా-జనసేన, ఇతరులు గెలిచారని ఆయన చెప్పారు. ఇవన్నీ పంచాయతీరాజ్‌ శాఖ క్షేత్రస్థాయి నుంచి సేకరించిన గణాంకాలని తెలిపారు. సోమవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.  ‘ఎన్నికల్లో మేమెక్కడా దౌర్జన్యాలు చేయలేదు, తెదేపావాళ్లే చేశారు. కుప్పంలో మా ఎంపీని, పార్టీ ఎన్నికల పర్యవేక్షకుడిని ఒక రోజంతా గృహనిర్బంధం చేశారు’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికల్లో ఓటమి వల్లే చంద్రబాబు ఎస్‌ఈసీని తిడుతున్నారన్నారు. ‘గ్రామంలో ఏ పార్టీ సర్పంచి గెలిచారో ఆ గ్రామస్థులకు స్పష్టంగా తెలుసు. తెదేపా 50% పంచాయతీల్లో గెలిచిందని చంద్రబాబు మీడియాలో రాయించుకున్నంత మాత్రాన అయిపోదు’ అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం పంపిణీ గురింవి విలేకరులు ప్రశ్నించగా.. ‘ప్రసాదాన్ని నేనైతే పంచలేదు’ అంటూ ముక్తాయించారు. గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థల్లోనూ వైకాపా గెలుస్తుందని మంత్రి చెప్పారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు