close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నువ్వు స్టేట్‌రౌడీవి.. నీ సైన్యం ఆకురౌడీలు

పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్యే గ్రంధి విమర్శలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్టేట్‌రౌడీ అయితే జనసైనికులు ఆకు రౌడీలని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శించారు. భీమవరం ఎమ్మెల్యే ఆకురౌడీ అని పవన్‌ చేసిన విమర్శలకు ఆయన ప్రతివిమర్శలు చేశారు. సాధారణ ఎన్నికల్లో రెండుచోట్లా పరాజయంతో పవన్‌ నిరాశ నిస్పృహలకు గురయ్యారని ఎద్దేవా చేశారు. ఆయనలో అపరిచితుడు ఉన్నాడని వ్యాఖ్యానించారు. జనసైన్యం వైఖరిని మీ కుటుంబసభ్యులే గతంలో ప్రశ్నించారంటే మీ పార్టీ తీరు ఏమిటో అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్యే శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు. భీమవరం అర్బన్‌ బ్యాంకును దోచేశానని ఆరోపించారని, వాస్తవాలు ఏమిటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. బ్యాంకును దోచేసి ఉంటే పవన్‌ మిత్రుడైన చంద్రబాబు తనపై అప్పట్లో ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. వీరవాసరం మండలం మత్స్యపురిలో జనసేన మద్దతుదారులు గెలవడంతో ఈర్ష్యతో జనసైనికులపై దాడి చేశారనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇటీవల ఒక సమావేశంలో పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ వైకాపా వారి తలలు తీసేస్తానని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ రౌడీయిజాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుందో తెలుస్తుందన్నారు.
ఒకప్పుడు పవన్‌ అభిమానిని
ఒకప్పుడు వ్యక్తిగతంగా తాను కూడా పవన్‌ కల్యాణ్‌ అభిమానినే అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన ధోరణి, ఊసరవెల్లిలా రంగులు మార్చడాన్ని చూసి తనలాంటి వారెందరో ఛీత్కరించారన్నారు. సాధారణ ఎన్నికల్లో ఓడించారని, ఇక్కడి ప్రజలపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దాడిలో గాయపడినవారిని పరామర్శించేందుకు మత్స్యపురి గ్రామంలోకి వెళ్తుంటే జనసేన కార్యకర్తలు కొందరు గేలిచేస్తూ దాడికి యత్నించారన్నారు. స్థానిక పోలీసుల సహకారంతోనే ఈ ఘటన జరిగిందన్న అనుమానంతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు