3 లోక్‌సభ, 8 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు వాయిదా
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

3 లోక్‌సభ, 8 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు వాయిదా

దిల్లీ: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని 3 లోక్‌సభ, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు నిర్వహించాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేయడానికి ఈసీ బుధవారం నిర్ణయించింది. కొవిడ్‌ తీవ్రత తగ్గి.. పరిస్థితులు మెరుగయ్యేంతవరకూ ఈ ఎన్నికలను నిర్వహించడం సరికాదని పేర్కొంది. ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన లోక్‌సభ స్థానాల్లో దాద్రా నాగర్‌ హవేలీ, ఖండ్వా (మధ్యప్రదేశ్‌), మండీ (హిమాచల్‌ప్రదేశ్‌)లు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌తో పాటు హరియాణా, మేఘాలయల్లో 2 చొప్పున.. రాజస్థాన్‌, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఒక్కో అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరపాల్సి ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని