అమూల్‌కు ఆస్తులను కట్టబెట్టేసే కుట్ర
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమూల్‌కు ఆస్తులను కట్టబెట్టేసే కుట్ర

తెదేపా నేత పట్టాభిరామ్‌ ఆరోపణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘రాష్ట్రంలోని వివిధ డెయిరీలకు చెందిన ఆస్తులను అమూల్‌కు కట్టబెట్టేందుకే మంత్రివర్గ సమావేశం నిర్వహించారు తప్ప కొవిడ్‌ నుంచి ప్రజల ప్రాణాలు రక్షించేందుకు కాదు. దాదాపు రూ.750 కోట్ల ఆస్తులను కేవలం రూ.3.38 కోట్లకే అమూల్‌కు కట్టబెట్టడం దేశంలోనే అతిపెద్ద డెయిరీ స్కాం’ అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘ఇదే అమూల్‌.. ఇతర రాష్ట్రాల్లో నాలుగైదు రెట్లు అధికంగా లీజు ధరలను చెల్లిస్తోంది. వాటి ప్రకారం లెక్కిస్తే... మన రాష్ట్రం లీజుకిచ్చిన ఆస్తుల విలువ ప్రకారం ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.100 కోట్లపైన ఆదాయం రావాలి. కానీ నామమాత్రంగా తీసుకుంటూ క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారన్నది సుస్పష్టం.
- తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. నరేంద్ర జ్వరంతో బాధపడుతున్నా జగన్‌లో ఏమాత్రం కనికరం లేదని ఓ ప్రకటనలో విమర్శించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు