టీకా వేయించలేని ప్రభుత్వం.. మూడు రాజధానులు కడుతుందా?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా వేయించలేని ప్రభుత్వం.. మూడు రాజధానులు కడుతుందా?

ఈనాడు, అమరావతి, తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కరోనా విజృంభిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం రోగులకు కనీస సదుపాయాలు, వైద్యం కల్పించలేకపోతోదంటూ అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులే స్వయంగా మాట్లాడటం రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోందని రాజధాని రైతులు విమర్శించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు టీకా, ఔషధాలు, పడకలే అందించలేని ప్రభుత్వం మూడు రాజధానుల్ని నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నాయకుల అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న నిరసనలు గురువారం నాటికి 506వ రోజుకు చేరాయి. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించేంత వరకూ తమ ఉద్యమాన్ని ఆపేది లేదని వారు నినాదాలు చేశారు. తుళ్లూరులో న్యాయదేవతకు పూజలు చేశారు. అమరావతి ఒక కులానికి పరిమితం కాదంటూ అనంతవరంలో మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. వెంకటపాలెం, వెలగపూడి, దొండపాడు, లింగాయపాలెం, నెక్కల్లు, పెదపరిమిలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కృష్ణాయపాలెం, మందడం, నీరుకొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు