ఉద్యోగాల కల్పన అంకెల గారడీయే!
close

ప్రధానాంశాలు

ఉద్యోగాల కల్పన అంకెల గారడీయే!

యనమల రామకృష్ణుడు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గత రెండేళ్లలో 6.03 లక్షల ప్రభుత్వోద్యోగాలు కల్పించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన అంకెల గారడీయేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న జగన్‌ మాటతప్పి కోటి మందికి ఉపాధిని పోగొట్టారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆ సంస్థ ఉద్యోగులందరికీ కొత్తగా ఉద్యోగాలిచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రకటించిన విధంగా అన్ని ఉద్యోగాలు ఇచ్చి ఉంటే పారదర్శకంగా అభ్యర్థుల ఫోన్‌ నంబర్లతో సహా వివరాలన్నీ ప్రభుత్వ వెబ్‌సైట్లో పెట్టాలని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘‘వైకాపా పాలనలో కొత్తగా ఇచ్చిన వాటికంటే పోయిన ఉద్యోగాలే 10 రెట్లు ఎక్కువ. పదిహేను రోజుల వ్యవధిలో ప్రకటనల్లో ఉద్యోగాలు కల్పించిన సంఖ్యను 4.77లక్షల నుంచి 6.03లక్షలకు పెంచేసుకున్నారు. 15రోజుల్లోనే సుమారు 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? 2.30 లక్షల ఖాళీలకు గాను 10వేల ఉద్యోగాలకు జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చి ఊరుకుంటారా? వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులు మాత్రమే అని చెప్పిన జగన్‌.. వారిని కూడా ఉద్యోగులుగా చూపడం మభ్యపెట్టడమే. వారంతా ప్రభుత్వ ఉద్యోగులైతే కనీస వేతన చట్టం ప్రకారం వారికి రూ.18 వేల వేతనం ఇవ్వాలి’ అని అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని