మాస్క్‌ పెట్టుకోని జగన్‌కు ఏ శిక్ష వేస్తారు?: లోకేశ్‌
close

ప్రధానాంశాలు

మాస్క్‌ పెట్టుకోని జగన్‌కు ఏ శిక్ష వేస్తారు?: లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘‘మాస్క్‌ పెట్టుకోకపోవడం నేరమైతే.. వైకాపా సెక్షన్‌ కింద కిరణ్‌ని హత్య చేసిన పోలీసులు రోజూ మాస్క్‌ పెట్టుకోని జగన్‌కు ఏ శిక్ష వేస్తారు?’’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు. ‘‘చీరాలలో ఎస్సీ యువకుడు కిరణ్‌కుమార్‌ మాస్క్‌ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపి ఏడాదైంది. ఈ హత్య వెనక ఉన్న కారణాలపై దర్యాప్తు జరగాలి. ఎస్సై, కానిస్టేబుళ్లను తక్షణమే శిక్షించాలి. బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలి’’ అని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని