ఆలయాలపై దాడుల నియంత్రణలో విఫలం

ప్రధానాంశాలు

ఆలయాలపై దాడుల నియంత్రణలో విఫలం

సీఎంపై సోము వీర్రాజు మండిపాటు

విద్యాధరపురం(విజయవాడ), నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు చేపట్టిన ఆలయాల సందర్శన యాత్రలో భాగంగా శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను, కోటప్పకొండను పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన సందర్శించారు. శనేశ్వరాలయం, సీతమ్మ వారి పాదాలు, ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ అంతర్వేదిలో రథం, రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం, ఇతర ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంతవరకు స్పందించలేదన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంటి పక్కనే ఉన్న దుర్గమ్మ ఆలయంలో వెండిరథంపైన ఉన్న సింహాలు అపహరణకు గురైతే ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని