సీబీఐ విచారిస్తుంటే సీఎం మౌనమెందుకు?

ప్రధానాంశాలు

సీబీఐ విచారిస్తుంటే సీఎం మౌనమెందుకు?

వివేకా హత్య కేసు విచారణపై తెదేపా నేత వర్ల రామయ్య

ఈనాడు-అమరావతి: ‘రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠగా నిరీక్షిస్తున్న ‘హూ కిల్డ్‌’ బాబాయ్‌ కేసులో వాస్తవాలను బయటపెట్టాలి. మాజీ మంత్రి వివేకానందరెడ్డిని హతమార్చడానికి ఇద్దరు ప్రముఖులు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు ప్రధాన సాక్షి రంగయ్య సీబీఐకి ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా విచారణ చేయించి వాస్తవాలు వెల్లడించాలి. ఆ ఇద్దరు ప్రముఖులు, వారిచ్చిన సుపారీ కథ సీఎం జగన్‌కు తెలిసే ఉంటుంది. వారిని కాపాడటానికే హత్య కేసు గురించి సీఎం పట్టించుకోవటం లేదు. రాజకోట రహస్యం బయటపడటం లేదు’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘సీబీఐ విచారణలో భాగంగా రంగయ్య వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట రికార్డు చేయటం వల్ల కోర్టు సాక్ష్యంగా పరిగణిస్తుంది. ఈ ఆరోపణలపై తక్షణం స్పందించి ఇద్దరు ప్రముఖులెవరో తేల్చాలని పోలీసు శాఖను ఆదేశించాల్సిన బాధ్యత సీఎంకు లేదా? భారీ మొత్తంలో సుపారీ ఇచ్చారంటే తెర వెనక ఎంత పెద్ద వ్యవహారం ఉందో? దీనిపై సీఎం, డీజీపీ స్పందిస్తారని 2రోజులుగా చూశా. సీబీఐకి సమాంతరంగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? కేసు విచారణ జరుగుతుంటే సీఎం ఎందుకు కంగారు పడుతున్నారు? ప్రధాన సాక్షి వాంగ్మూలం రికార్డు చేయించాక సీబీఐ బృందానికి నేతృత్వం వహిస్తున్న డీఐజీ స్థాయి అధికారి సుధాసింగ్‌ స్థానంలో ఎస్పీని విచారణాధికారిగా నియమించి కేసు ప్రాధాన్యాన్ని తగ్గించారు’ అని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని