ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఇంటి ముట్టడి

ప్రధానాంశాలు

ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఇంటి ముట్టడి

వివాదాస్పద వ్యాఖ్యలను నిరసించిన భాజపా నేతలు

ఎమ్మిగనూరు పట్టణం, న్యూస్‌టుడే: గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఇంటిని ఆదివారం భాజపా నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులకు, భాజపా శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. తొలుత మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌జైన్‌, భాజపా కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు రామస్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరీష్‌బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునిగిరి నీలకంఠ, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కేఆర్‌ మురహరిరెడ్డి, జగ్గాపురం చిన్నఈరన్న, మహిళా మోర్చా నాయకురాలు, కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి బయలు దేరారు. వీరిని పోలీసులు అడ్డుకోగా కొంతమంది తప్పించుకుని ఎమ్మెల్యే ఇంటి గేటు వద్ద బైఠాయించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని