రాష్ట్రవ్యాప్తంగా భాజపా ఆందోళన

ప్రధానాంశాలు

రాష్ట్రవ్యాప్తంగా భాజపా ఆందోళన

ఈనాడు డిజిటల్‌- అమరావతి: వైకాపా ప్రభుత్వం హిందూ ధర్మంపై దాడుల్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా నిర్వహించింది. కలెక్టర్లు, ఆర్డీవోలకు నాయకులు వినతిపత్రాలు అందించారు. ప్రకాశం జిల్లాలో ఎస్టీలపై దాడులకు దిగిన వైకాపా నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి అనంతపురం జిల్లా కదిరిలో ఎమ్మార్వో కార్యాలయంలోకి గోవును తీసుకెళ్లి కొద్దిసేపు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. తిరుపతిలో జరిగిన నిరసనలో భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌నాయుడు, ఒంగోలులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సత్యనారాయణ, గుంటూరులో రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, నెల్లూరులో మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, కిసాన్‌మోర్చ జాతీయ ఉపాధ్యక్షుడు సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట నేతలు ధర్నా చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని