నిందితులను వదిలి బాధితులపై కేసులా?

ప్రధానాంశాలు

నిందితులను వదిలి బాధితులపై కేసులా?

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్టును తెదేపా నేతలు ఖండించారు. మైనింగ్‌ అక్రమాలను బయటపెట్టేందుకు వెళ్లిన ఉమాపై దాడి చేసిన వారిని వదిలి... దాడికి గురైన అయన్ని అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు.శాసన మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఒక మాజీ మంత్రినే చట్టవ్యతిరేకంగా ఇంతగా హింసిస్తుంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. ‘‘నిందితులను వదిలి బాధితులను అరెస్టు చేయమని ఏ చట్టంలో ఉంది? మైలవరం నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ కనుసన్నల్లోనే రూ.వేల కోట్ల విలువైన గ్రావెల్‌ను కొల్లగొడుతున్నారు. దీన్ని అడ్డుకున్న వారిపై హత్యాయత్నం చేస్తారా?’  అని ప్రశ్నించారు. ‘‘ఉమాపై ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రయోగించింది. వైకాపా అరాచకాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నారనే ఆయన్ని అరెస్టు చేశారు. దాడిచేసిన నిందితులను అరెస్టు చేయాల్సిన పోలీసులు.. బాధితులపైనే కేసులు పెట్టార’ని ఎమ్మెల్సీ లోకేశ్‌ మండిపడ్డారు. ఉమా అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని