రెండో డిప్యూటీ మేయర్లు, ఉపాధ్యక్షపదవులకు వైకాపా జాబితా సిద్ధం

ప్రధానాంశాలు

రెండో డిప్యూటీ మేయర్లు, ఉపాధ్యక్షపదవులకు వైకాపా జాబితా సిద్ధం

నేడు బీ-ఫారాల అందజేత

ఈనాడు, అమరావతి: నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటి మేయర్‌, పురపాలక సంస్థల్లో రెండు ఉపాధ్యక్ష పదవులకు వైకాపా అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. బుధవారం రాత్రి వరకూ దీనిపై కసరత్తు చేసిన తర్వాత జాబితాను ఖరారు చేసినట్లు తెలిసింది. వీరందరికీ గురువారం బీ-ఫారాలను వైకాపా నాయకత్వం అందజేయనుంది. 12 నగరపాలక, 75 పురపాలక సంస్థలకు సంబంధించి రెండో డిప్యూటీ మేయర్‌, రెండో ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని