చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే దాడి

ప్రధానాంశాలు

చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే దాడి

 ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యేలు నాగార్జున, రమేష్‌

‘ఎస్సీలపై దేవినేని ఉమా దాడి చేయిస్తే, ఆయన కుటుంబసభ్యుల పరామర్శకు వెళ్లేందుకు చంద్రబాబుకు సిగ్గుందా?’ అని వైకాపా ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, జోగి రమేష్‌ విమర్శించారు. మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే ఉమా జి.కొండూరులో ఎస్సీలపై దాడి జరిగింది. ఈ ఘటనలో చంద్రబాబు పాత్రపైనా పోలీసులు దర్యాప్తు చేయాలి’ అన్నారు. ఎంపీ సురేష్‌ మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో ఎస్సీలంతా కలిసి ఓడించారని వారిపై చంద్రబాబు పగబట్టారు. అందువల్లే వారిపై ఉమా లాంటి వారిని ఉసిగొల్పి దాడి చేయించారు. ఎస్సీలపై ఉమా చర్యలను చంద్రబాబు సమర్థిస్తున్నారా?’ అని ప్రశ్నించారు. జోగి రమేష్‌ మాట్లాడుతూ.. ‘ఉమా, ఆయన అనుచరులు ఎస్సీలను దుర్భాషలాడి, దాడి చేసినందుకు వారిపై ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. దానిమీద చంద్రబాబు ఎందుకు రంకెలేస్తున్నారు?’ అని వ్యాఖ్యానించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని