దుర్మార్గ ప్రభుత్వమే అయితే మీరు రాష్ట్రానికి రాగలరా?

ప్రధానాంశాలు

దుర్మార్గ ప్రభుత్వమే అయితే మీరు రాష్ట్రానికి రాగలరా?

 చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: ‘వైకాపాది మీరు చెబుతున్నంత దుర్మార్గ ప్రభుత్వమే అయితే షికారుకు వచ్చినట్లు మాటిమాటికీ హైదరాబాద్‌ నుంచి మీరు వచ్చి వెళ్లగలరా? గొల్లపూడి దాటి రాగలరా? ఈ రాష్ట్రంలో తిరగ్గలరా?’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ ‘ఏవో సంఘటనలు సృష్టించి వాటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని.. తప్పుడు ఆలోచనలతో చంద్రబాబు ఆయన వందిమాగధులను ఉసిగొల్పుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కొండపల్లిలో మైనింగ్‌ చేసుకునేందుకు అనుమతించారు. దేవినేని ఉమా, చంద్రబాబు అక్కడ కొండలను పిండి చేసి దోచేశారు. ఇప్పుడు దాన్ని మైలవరం వైకాపా ఎమ్మెల్యేకు ఆపాదించాలని కుట్రలు చేస్తున్నారు. దాడులకు కుట్రదారుడు కాబట్టే ఉమాపై కేసు నమోదు చేశారు’ అని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని