సామాజిక న్యాయాన్ని నమ్మిన వ్యక్తిని: చంద్రబాబు

ప్రధానాంశాలు

సామాజిక న్యాయాన్ని నమ్మిన వ్యక్తిని: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘నేను సామాజిక న్యాయాన్ని నమ్మిన వ్యక్తిని. జనాభా ప్రాతిపదికన సమన్యాయం జరగాలనే సిద్ధాంతానికి తెదేపా కట్టుబడి ఉంది’ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ‘ఇంటలెక్చువల్‌ ఫోరం ఫర్‌ మాదిగ అండ్‌ అలైడ్‌ కమ్యూనిటీస్‌ ఆఫ్‌ ఇండియా’ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు బుధవారం భేటీ అయ్యారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ తెన్నేటి జయరాజు, అధ్యక్షులు రామాంజనేయులు, కన్వీనర్‌ విజయచంద్ర బోనెల, 13 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. తమ సామాజికవర్గానికి విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన జిల్లా యూనిట్‌గా న్యాయం జరగాలని వారు కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వచ్చాక జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా కన్వీనర్‌ విజయచంద్రతోపాటు పలువురు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని