హోరెత్తిన గోదావరి జిల్లాలు

ప్రధానాంశాలు

హోరెత్తిన గోదావరి జిల్లాలు

రైతు కోసం కదం తొక్కిన తెదేపా నాయకులు

ఈనాడు, అమరావతి, కాకినాడ, న్యూస్‌టుడే-ఏలూరు టూటౌన్‌: అన్నదాతల సమస్యల పరిష్కారానికి తెదేపా ఐదు రోజులపాటు చేపట్టిన ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమం బుధవారం రెండోరోజు ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లో జరిగింది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వ్యవసాయ యంత్రాలు, ఎడ్లబళ్లు, ట్రాక్టర్లతో ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించారు. పంటలను రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. తహసీల్దారు కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. పలుచోట్ల పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది.

తూర్పుగోదావరి జిల్లాలో..: జగ్గంపేట నియోజకవర్గంలో కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ తదితరులను తహసీల్దారు కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.సామర్లకోటలో మాజీ ఉపముఖ్యమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నిరసన ప్రదర్శనలు జరిపారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..: ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ ఆధ్వర్యంలో పాలకొల్లు మండలం మైజారుగుంటలో రైతులు క్రాప్‌హాలిడే ప్రకటించిన రైతుల పొలాల్లో దిగి 200 అడుగుల భారీ నల్లజెండాతో నిరసన తెలియజేశారు. ఉంగుటూరులో లోక్‌సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.

కృష్ణా జిల్లాలో..: ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నూజివీడులో మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు, కైకలూరులో ర్యాలీలు నిర్వహించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని