అక్టోబరు 2న రోడ్లపై శ్రమదానం

ప్రధానాంశాలు

అక్టోబరు 2న రోడ్లపై శ్రమదానం

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ వెల్లడి

అరసవల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, ప్రభుత్వం త్వరితగతిన స్పందించకపోతే అక్టోబరు 2వ తేదీన రోడ్లపైకి వచ్చి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ శ్రమదానం చేస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. సోమవారం శ్రీకాకుళంలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారులు మరమ్మతు చేసేందుకు రూ.14,350 కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోందని.. ఆ పనులు ఎక్కడ చేయించారో చూపించాలని డిమాండు చేశారు. దీనిపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సినిమా టికెట్ల అమ్మకాలు, మటన్‌ మార్ట్‌లు ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయం జనసేనే అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని