కార్పొరేట్‌కు కట్టబెడితే పోరాటాలకు సిద్ధం

ప్రధానాంశాలు

కార్పొరేట్‌కు కట్టబెడితే పోరాటాలకు సిద్ధం

 విశాఖలో ముగిసిన జన ఆందోళన

విశాఖపట్నం(కూర్మన్నపాలెం), న్యూస్‌టుడే: వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్‌కు కట్టబెడితే సహించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు, కేరళ ఎంపీ బినోయ్‌ విశ్వం హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ‘జన ఆందోళన్‌ ప్రచార జాత’ ముగింపు సభను మంగళవారం విశాఖపట్నం కూర్మన్నపాలెం కూడలిలోని ఉక్కు దీక్షా శిబిరం వద్ద నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ బినోయ్‌ విశ్వం మాట్లాడుతూ.. ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం అందరి లక్ష్యమన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, ఉక్కు పరిశ్రమపై రాష్ట్రానికి న్యాయం జరగకపోతే ప్రజాప్రతినిధులు ద్రోహులుగా, చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎంపీలను ప్రధాని వద్దకు తీసుకెళ్లే బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డి తీసుకోవాలన్నారు. సీపీఐ సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఓబులేసు, రవీంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉక్కు కార్మికులు ర్యాలీ నిర్వహించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని