ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికలో రిజర్వేషన్‌కు వైకాపా నిర్ణయం!

ప్రధానాంశాలు

ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికలో రిజర్వేషన్‌కు వైకాపా నిర్ణయం!

ఈనాడు, అమరావతి: మండల పరిషత్‌ అధ్యక్షుల ఎన్నిక నేపథ్యంలో అధికార వైకాపా రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఒక మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్ష పదవీ..ఈ రెండూ ఓసీలకే రిజర్వు అయి ఉంటే ఎంపీపీ అధ్యక్ష పదవిని ఆ వర్గానికి కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో ఒక వర్గానికి కేటాయించాలనేది ఆ నిర్ణయం. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలను స్వీకరిస్తున్నారు. బుధవారం సాయంత్రానికి ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. వాటి ఆధారంగా ఎమ్మెల్యేలకు బి.ఫారాలు పంపుతారని తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని