రాష్ట్ర మర్యాదను కాలరాస్తారా?: మంత్రి పేర్ని నాని

ప్రధానాంశాలు

రాష్ట్ర మర్యాదను కాలరాస్తారా?: మంత్రి పేర్ని నాని

ఈనాడు, అమరావతి: ‘మద్రాసులో స్థిరపడిన ఒక వ్యక్తి ఎక్కడో అఫ్గానిస్థాన్‌ నుంచి గుజరాత్‌లోని పోర్టు ద్వారా దిల్లీకి మత్తు మందులను తీసుకువెళ్లేందుకు సిద్ధం చేసుకుంటే దాన్ని పట్టుకుని కన్నతల్లి లాంటి ఆంధ్ర రాష్ట్ర మర్యాదను కాలరాసేలా తెదేపా నేతలు మాట్లాడుతున్నారు. సీఎం జగన్‌పై రాజకీయ కక్షను తీర్చుకునేందుకు మత్తుమందుల వ్యాపారం రాష్ట్రంలో జరుగుతోందంటూ అడ్డగోలుగా విమర్శిస్తున్నారు. వీరికి తాలిబన్లకూ తేడా లేకుండా పోయింది’ అని రాష్ట్ర సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఆ మత్తుమందులకు విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ విడమరిచి చెప్పినా వీళ్ల బుర్రలకు ఎక్కడం లేదా? హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో రోజూ వందల కిలోల బంగారం పట్టుబడుతుంటే అది తెలంగాణ ప్రభుత్వమే చేయిస్తోందని అక్కడున్న ప్రతిపక్షాలు మాట్లాడటం మనం ఎప్పుడైనా చూశామా?’ అని ప్రశ్నించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని