ప్రతి పేద విద్యార్థికీ ఉన్నత చదువులు: సజ్జల

ప్రధానాంశాలు

ప్రతి పేద విద్యార్థికీ ఉన్నత చదువులు: సజ్జల

ఈనాడు, అమరావతి: ‘ప్రతీ పేద విద్యార్థీ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత చదువుల వరకు చదువుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రణాళికలను రూపొందించారు. దీంతోపాటు వారు ఆంగ్లమాధ్యమంలో చదివి ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారు’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం వైకాపా కేంద్ర కార్యాలయంలో ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ సయ్యద్‌ ఆసిఫా అధ్యక్షతన జరిగిన ఆ వర్గాల ప్రతినిధుల సమావేశంలో సజ్జల ప్రసంగించారు. ‘చంద్రబాబు రూ.3లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ఇప్పుడు జగన్‌ సుమారు రూ.లక్ష కోట్లు ప్రజల ఖాతాల్లో వేశారు. దళారీ వ్యవస్థ లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ బీసీ కులాల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అన్ని వర్గాల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని