చంద్రబాబుపై కార్యకర్తను గెలిపించుకుంటాం

ప్రధానాంశాలు

చంద్రబాబుపై కార్యకర్తను గెలిపించుకుంటాం

ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి

ఈనాడు డిజిటల్‌,అమరావతి: శాసనసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలంటున్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు... తొలుత కుప్పం ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సవాల్‌ చేశారు. ఆయనపై వైకాపా తరఫున సాధారణ మహిళా కార్యకర్తని నిలబెట్టి గెలిపిస్తామని లేకపోతే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎస్సీ వర్గానికి చెందిన హోంమంత్రిని కించపర్చేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు.మంగళవారం సచివాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ...‘ఎస్సీ, ఎస్టీ, బీసీల మధ్య చిచ్చుపెట్టేలా అయ్యన్నపాత్రుడు వ్యవహరిస్తున్నారు. ఉగ్రవాదులు కూడా ఆయనలా మాట్లాడరు. దిశ చట్టం గురించి అయ్యన్నకు తెలుసా..? మహిళలపై 300 ఘటనలు జరిగాయని ఆరోపించారు. వారందరి జాబితా తీసుకొస్తే.. ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో చెబుతాం. ఇకనైనా తీరు మార్చుకోవాలని ఆయనను హెచ్చరిస్తున్నాం’ అని సూచించారు. ‘జగన్‌పై అక్రమ కేసులు పెట్టిన కుటుంబాలు రాజకీయంగా నిర్వీర్యం అయిపోయాయి’ అని ఆక్షేపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని