నీ స్థాయి తెలుసుకో..

ప్రధానాంశాలు

నీ స్థాయి తెలుసుకో..

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీపై విరుచుకుపడిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌

అలంకార్‌కూడలి (విజయవాడ), న్యూస్‌టుడే: ‘నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు. సీఎం జగన్‌ గురించి మాట్లాడే అర్హత, స్థాయి నీకుందా’? అని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావుపై విరుచుకుపడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. విజయవాడ ఎంబీ విజ్ఞానకేంద్రంలో ఐటీఐ-డీఎల్‌టీసీ ఉద్యోగుల సంఘం 12వ రాష్ట్రస్థాయి సమావేశం ఇటీవల నిర్వహించారు. సమావేశానికి పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైకాపా నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ.. ‘ఎన్నికల ముందు జగన్‌ తన ప్రచారంలో ముందో మైకు, వెనకో మైకు పెట్టుకుని తాను సీఎం అయితే సీపీఎస్‌ రద్దు చేస్తానన్నారు. పీఆర్‌సీ, డీఏలు ఇస్తానన్నారు. రెండున్నరేళ్లయినా హామీలు అమలు చేయలే’దని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే విష్ణు దీటుగా స్పందించారు. తాను వేదికపై ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులను, ఇతర వైకాపా నాయకులను ఏమైనా అంటే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. అభిప్రాయాలు చెబితే తప్పేంటని ఎమ్మెల్సీ సమాధానమివ్వగా.. ఎమ్మెల్యే మండిపడ్డారు. ‘ఎమ్మెల్సీవి కదా అని గౌరవిస్తున్నా. గుర్తుపెట్టుకోండి. మీ ఐదుగురు ఎమ్మెల్సీలు ఏం సాధిస్తారు? ఏం చేయగలరు?’ అంటూ నిలదీశారు. ఎమ్మెల్సీపై ఎమ్మెల్యే వ్యాఖ్యలను ప్రభుత్వ, ఒప్పంద ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్‌ ఏవీ నాగేశ్వరరావు, సెక్రటరీ జనరల్‌ ఎం.బాలకాశీలు ప్రకటనలో ఖండించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని