జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థుల ఖరారు..

ప్రధానాంశాలు

జడ్పీ ఛైర్మన్‌ అభ్యర్థుల ఖరారు..

ఈనాడు, అమరావతి: జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ అభ్యర్థుల పేర్లను అధికార వైకాపా ఖరారు చేసింది. ఈ మేరకు వారికి బి.ఫారాలను పంపింది. శనివారం జిల్లాల్లో జరగనున్న ఎన్నికల్లో వీరంతా పోటీ పడనున్నారు. వీరికే పదవులు దక్కనున్నాయి. ఏడు జిల్లాలకు ఛైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా మహిళల పేర్లు ఖరారయ్యాయి. ప్రతి జిల్లాపరిషత్‌కూ ఇద్దరు చొప్పున మొత్తం 26 మంది ఉపాధ్యక్షుల జాబితాను వైకాపా సిద్ధం చేసి జిల్లాల పార్టీ బాధ్యులకు పంపింది. ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్లను జడ్పీటీసీ సభ్యులు పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. ఆయా జిల్లాపరిషత్‌లలో ఇద్దరు కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక పూర్తయ్యాక ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్ల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జిల్లాపరిషత్‌లలో ఇద్దరు వైస్‌ఛైర్మన్ల ఎన్నిక కోసం పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్‌ వెలువడింది. మండల పరిషత్‌ల్లోనూ ఇద్దరు వైస్‌ఛైర్మన్లను ఎన్నుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం త్వరలో ఆర్డినెన్సు జారీ అయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని