డ్రగ్స్‌ మాఫియాకు ప్రభుత్వ అండ

ప్రధానాంశాలు

డ్రగ్స్‌ మాఫియాకు ప్రభుత్వ అండ

 తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఆరోపణ

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ అండతో రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియా కొనసాగుతోందని గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో శనివారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. అక్రమ మద్యం వ్యాపారం, డ్రగ్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ కేంద్రబిందువుగా మారిందని అన్నారు. అఫ్గానిస్థాన్‌నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్‌కు డ్రగ్స్‌ సరఫరా కావడం రాష్ట్రానికి సిగ్గుచేటని విమర్శించారు. కల్తీమద్యాన్ని అరికట్టకుండా ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలాడుతోందని అన్నారు. ఇక్కడ తయారుచేస్తున్న మద్యాన్ని కేంద్ర బృందాలతో తనిఖీ చేయించాలని డిమాండ్‌ చేశారు. డ్రగ్స్‌ దిగుమతి చేసుకున్న ఆషీ కంపెనీ ముఖ్యమంత్రి బంధువులదేనని, అందువల్ల ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారని ఆరోపించారు. గుంటూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్‌డీలర్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా నరసరావుపేటలో డ్రగ్స్‌ మాఫియా నడుస్తోందని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని