హెరాయిన్‌ రవాణాపై సీఎం ఎందుకు స్పందించరు?

ప్రధానాంశాలు

హెరాయిన్‌ రవాణాపై సీఎం ఎందుకు స్పందించరు?

హెరాయిన్‌ రవాణాపై సీఎం ఎందుకు స్పందించరు? ?

ఈనాడు డిజిటల్‌-అమరావతి: ‘ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోని ఆశీ ట్రేడింగ్‌ పేరుతో దిగుమతి చేసుకున్న రూ.72 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ గుజరాత్‌లో పట్టుబడితే ఏపీ పోలీసులు కనీసం విచారణ జరపలేదు. ఇప్పటివరకు రూ.1.96 లక్షల కోట్ల హెరాయిన్‌ దిగుమతి చేసుకున్నట్లు వార్తలొస్తుంటే.. సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదని’ తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు.  శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఆశీ ట్రేడింగ్‌ చిరునామా మాత్రమే రాష్ట్రంలో ఉందని దాని కార్యకలాపాలు ఇక్కడ లేవని డీజీపీ చెబుతున్నారు. ఆ సంస్థ గత 9 నెలలుగా జీఎస్టీ చెల్లిస్తున్నట్లుగా ఉంది. దీనిపై డీజీపీ ఏం సమాధానం చెబుతారు? ఇదే అంశంపై డీఆర్‌ఐ విచారణ జరిపిస్తే రాష్ట్ర పోలీసులు ఏం చేస్తారు? హెరాయిన్‌ కేసులో పట్టుబడ్డ వ్యక్తి సుధాకర్‌కి, వైసీపీ నేతలకు సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. పోలీసులు ఆ కోణంలో విచారణ చేశారా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గరున్న ఈ-వే బిల్లులు ఎందుకు బయటపెట్టడం లేదు?’ అని ప్రశ్నించారు.

పాదయాత్రలో ఎందుకు బెణకలేదు: ఆంధ్రప్రదేశ్‌ హక్కులపై కేంద్రంతో పోరాడాల్సిన ముఖ్యమంత్రి జగన్‌.. కాలు బెణికిందంటూ తాడేపల్లిలో ఇంట్లో కూర్చున్నారని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసినప్పుడు లేనిది.. ఇప్పుడెందుకు బెణికిందని ప్రశ్నించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని