రాలుతున్న నవరత్నాలు

ప్రధానాంశాలు

రాలుతున్న నవరత్నాలు

రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: ‘అమ్మఒడి కింద జూన్‌లో ఇవ్వాల్సిన పైసలు జనవరిలో ఇస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. అంటే నెమ్మదిగా ఒక ఏడాది వెనక్కు నెట్టడమే. ఆర్థిక ఇబ్బందులతో ఒక రత్నం రాలిపోయిందని, నవరత్నాలూ రాలుతాయని ప్రజలు అనుకుంటున్నారని’ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి బొగ్గు సరఫరాలో ఇబ్బందులపై నేను కోల్‌ ఇండియా మాజీ ఛైర్మన్‌తో ఇటీవల మాట్లాడానని, తమ దగ్గర వంద మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వ ఉన్నప్పుడు తీసుకోమని లేఖలు రాస్తే ఎవరూ స్పందించలేదని ఆయన చెప్పారన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు సమస్యల పరిష్కారానికి జెన్‌కో-ట్రాన్స్‌కోలకు ఒకే ఛైర్మన్‌ను నియమించాలని కోరారు. బొగ్గు కంపెనీలకు బకాయిలు చెల్లించాలని సూచించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని