కాపులకు ఏం ఒరగబెట్టారు?

ప్రధానాంశాలు

కాపులకు ఏం ఒరగబెట్టారు?

ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ధ్వజం

ఈనాడు, అమరావతి: జగన్‌ రెండున్నరేళ్ల పాలనలో కాపులకు అడుగడుగునా అన్యాయం, అవమానాలే తప్ప వారికి ఒనగూరిన ప్రయోజనం శూన్యమని తెదేపా నేత, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. ‘కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు. విద్య, ఉద్యోగావకాశాల్లో తెదేపా ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లను రద్దు చేశారు. దాని వల్ల ఒక్క సచివాలయ ఉద్యోగాల్లోనే దాదాపు 12 వేల మంది నిరుద్యోగులు అవకాశం కోల్పోయారు. కాపు నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని’ ఆయన ధ్వజమెత్తారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని