జీతాలు అడిగితే ఒప్పంద ఉద్యోగులను తీసేస్తారా?

ప్రధానాంశాలు

జీతాలు అడిగితే ఒప్పంద ఉద్యోగులను తీసేస్తారా?

సీఎంకు తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ లేఖ

ఈనాడు, అమరావతి: ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తానని, ఏజెన్సీల వంటి దళారీ వ్యవస్థ లేకుండా చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కాగానే జగన్‌ గాలికొదిలేశారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘జగన్‌ ముఖ్యమంత్రయ్యాక ఇప్పటివరకు కాకినాడ జీజీహెచ్‌లో 66 మందిని, యూపీహెచ్‌సీ ఉద్యోగులు 1700 మందిని, 180 మంది ఆప్కోస్‌ ఉద్యోగుల్ని తొలగించారు. ఆప్కోస్‌ నుంచి 14 నెలలు, అంతకు ముందు ఏజెన్సీల నుంచి ఆరు నెలల పెండింగ్‌ జీతాలు ఇవ్వకుండా తొలగించడంతో చిరుద్యోగులు కుటుంబాలతో సహా రోడ్డున పడ్డారు. జీతాల బకాయిలు అడుగుతున్నారని ఆరు వందల మందిని తీసేశారంటే ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందని’ ఆయన దుయ్యబట్టారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు 20 నెలల జీతాల బకాయిల్ని తక్షణమే చెల్లించాలని, తొలగించిన ఉద్యోగులందర్నీ ఆప్కోస్‌లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆయన గురువారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని