సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ప్రధానాంశాలు

సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

యనమల రామకృష్ణుడు డిమాండ్‌

తుని, న్యూస్‌టుడే: రెండున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు చేసింది? తెదేపా పథకాలు ఎన్ని రద్దు చేసిందన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమవడం ఎప్పుడూ చూడలేదని, వైకాపా ప్రభుత్వం చేతకానితనంతో ఈ పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి లేకపోయినా సీఎం బినామీల ఆస్తులు మాత్రం బాగా పెరుగుతున్నాయని ఆరోపించారు. నెలకు రూ.2వేల కోట్లు అప్పులు చేస్తున్నా ఏమవుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కొత్త పరిశ్రమలు రాక, ఉన్నవీ పోతుండటంతో నిరుద్యోగ సమస్య పెరుగుతోందని వివరించారు. రెండున్నరేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం రూ.2వేల కోట్లతో కేవలం నాలుగే కొత్త పథకాలు ప్రారంభించిందన్నారు. ప్రజలకు ఓ చేత్తో రూపాయి ఇస్తూ, మరో చేత్తో రూ.5 వసూలు చేస్తోందని తెలిపారు. తమ హయాంలో ఒక్కో విద్యార్థికి అన్ని రకాలుగా ఏడాదికి రూ.75 వేలు ఖర్చు చేసేవారమని, ఈ ప్రభుత్వం రూ.30 వేలు మాత్రమే ఇస్తోందని వివరించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని