మంత్రి సురేష్‌ నియోజకవర్గంలోనే ఎస్సీలపై దాడులు

ప్రధానాంశాలు

మంత్రి సురేష్‌ నియోజకవర్గంలోనే ఎస్సీలపై దాడులు

అచ్చెన్నాయుడి ధ్వజం

ఈనాడు, అమరావతి: తన సొంత నియోజకవర్గంలోనే ఎస్సీలపై దాడులు జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ‘పరిషత్‌ ఎన్నికల్లో వైకాపా నేతలు ఓడిపోతే దానికి ఎస్సీలు కారణమవుతారా? అధికారాన్ని కట్టబెట్టిన వారిపైనే జగన్‌రెడ్డి పార్టీ దుర్మార్గాలకు పాల్పడుతోంది’ అని విమర్శించారు. ‘ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో ఎస్సీలపై వైకాపా మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నాజీల దురాగతాలను కళ్లకు కట్టేలా సామూహిక అత్యాచారాలు, శిరోముండనాలు, హత్యాయత్నాలు, అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, గృహనిర్బంధాలు, కక్ష సాధింపులతో వైకాపా పాలన సాగుతోంది’ అని ఆదివారం ప్రకటనలో ఆయన ధ్వజమెత్తారు. మంత్రి నియోజకవర్గంలోని రాజుపాలెంలో ఎస్సీ యువతిపై అత్యాచారం చేసిన కరుణాకర్‌రెడ్డిపై ఇప్పటికీ చర్యల్లేవన్నారు.

* ఎస్సీలపై దాడులు ఆపకపోతే స్వీయరక్షణ దళం ఏర్పాటుచేసుకుంటామని మాజీ మంత్రి జవహర్‌ పేర్కొన్నారు. ‘జగన్‌ అధికారంలోకొచ్చాక ఎస్సీల ప్రాణాలకు రక్షణ లేదు. విద్య, ఉపాధి అవకాశాలు దూరమవుతున్నాయి’ అని విమర్శించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని