సుస్థిర పాలన కాంగ్రెస్‌కే సాధ్యం: శైలజానాథ్‌

ప్రధానాంశాలు

సుస్థిర పాలన కాంగ్రెస్‌కే సాధ్యం: శైలజానాథ్‌

బద్వేలు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీతోనే సుస్థిర పాలన సాధ్యమని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు. కడప జిల్లా బద్వేలులో ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాలు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. విద్యుత్తు, పెట్రోలు ధరలను ఇష్టానుసారం పెంచాయని మండిపడ్డారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో బద్వేలు పట్టణానికి తాగునీరు ఇచ్చిన ఘనత కమలమ్మకే దక్కుతుందన్నారు. ఓటర్లు ఈ విషయాన్ని గుర్తించి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని