సీఎంపై ఆ మాటలుబాధాకరం: హోంమంత్రి సుచరిత

ప్రధానాంశాలు

సీఎంపై ఆ మాటలుబాధాకరం: హోంమంత్రి సుచరిత

గుంటూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై తెదేపా నేత పట్టాభి మాట్లాడిన మాటలు బాధాకరమని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆయన అలాంటి భాష మాట్లాడకూడదని, ఇలాంటి కేసులోనే ఆయన బెయిల్‌పై ఉన్నారని చెప్పారు. సీఎంను అభిమానించే వారు స్పందించారన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలోనే అసభ్యకరంగా మాట్లాడారని గుర్తుచేసిన ఆమె, పట్టాభి మాటలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని