పథకం ప్రకారమే దాడులు

ప్రధానాంశాలు

పథకం ప్రకారమే దాడులు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఈనాడు, అమరావతి: పోలీసుశాఖ సకాలంలో స్పందించి ఉంటే.. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి జరిగి ఉండేది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. ‘తెదేపా కార్యాలయం, నేతలు, కార్యకర్తలపై దాడులు అనుకోకుండా జరిగినవి కావు.. పథకం ప్రకారమే అధికార పార్టీ కనుసన్నల్లో దాడి చేశారు’ అని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర విభాగం సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులతో కలిసి బుధవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలించారు. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆయనకు దాడి జరిగిన తీరును వివరించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. ‘డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి.. పోలీసుల ప్రోద్బలంతోనే జరిగింది. సీఎం జగన్‌కు తెలియకుండా ఇక్కడ ఏ ఘటనా జరగలేదు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారు’ అని విమర్శించారు. దాడులపై   సీఎం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని