దీనంతటికీ దర్శకత్వం చంద్రబాబుదే: కన్నబాబు

ప్రధానాంశాలు

దీనంతటికీ దర్శకత్వం చంద్రబాబుదే: కన్నబాబు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా ఉనికిని కాపాడుకునేందుకే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన పార్టీ నేతల్ని ఉసిగొల్పారని మంత్రి కన్నబాబు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలిసి మంత్రి విలేకర్లతో మాట్లాడారు. తెదేపా నేత పట్టాభే పార్టీని నడుపుతున్నట్లు ఉందని, లోకేశ్‌ చేసిన ట్వీట్‌లో బూతులు మాట్లాడారని విమర్శించారు. అక్కడ జరిగే సకల డ్రామాలకూ దర్శకత్వం చంద్రబాబుదేనని, పోలీసులు ఆయన్ను ప్రధాననిందితునిగా చేసి విచారణ జరపాలని అన్నారు. దాడులకు పాల్పడింది వైకాపా వర్గాలా, తెదేపా వర్గాలా.. ఇంకెవరైనా అనేది పోలీసుల విచారణలో తేలుతుందని అంబటి రాంబాబు చెప్పారు. దానికిముందే వైకాపాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని