చేతలతోనే సమాధానం: మంత్రి అప్పలరాజు

ప్రధానాంశాలు

చేతలతోనే సమాధానం: మంత్రి అప్పలరాజు

శ్రీకాకుళం, న్యూస్‌టుడే: ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని, ప్రతి మాటకూ చేతలతోనే సమాధానం ఉంటుందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళంలో బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ తెదేపా నేత పట్టాభి వ్యాఖ్యలపై స్పందించారు. ‘పట్టాభికి ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు, స్థాయి లేవు. మాకూ తిట్టడం వచ్చు. అధికారంలో ఉన్నామని సహనం వహిస్తున్నాం. అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేసి వస్తా. గతంలో లోకేశ్‌, అయ్యన్నపాత్రుడు, ఇప్పుడు పట్టాభి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలి’ అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని