తెదేపాను నిషేధించాలని ఈసీకి లేఖ రాస్తాం: మంత్రి బొత్స

ప్రధానాంశాలు

తెదేపాను నిషేధించాలని ఈసీకి లేఖ రాస్తాం: మంత్రి బొత్స

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాజ్యాంగవ్యతిరేక వ్యాఖ్యలు చేసిన తెదేపాను నిషేధించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. బుధవారం విజయనగరంలో చెత్త తరలింపు వాహనాలను ప్రారంభించి, విలేకర్లతో మాట్లాడారు. ‘చంద్రబాబు నేతృత్వంలో వారి అధికారప్రతినిధి సీఎం జగన్‌ గురించి మాట్లాడిన భాషను సభ్యసమాజం హర్షించదు. రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని తూలనాడటం ఎంతవరకు సమంజసం? ఇదే భాషలో మీ గురించి మాట్లాడితే సమర్థిస్తారా? మా పార్టీపై అభాండం వేస్తూ ఆర్టికల్‌ 356 విధించాలంటారా? మావోయిస్టులు శాంతిభద్ర]తలకు విఘాతం కలిగిస్తున్నట్లే.. మీ వైఖరి ఉంది. దీనికి పవన్‌కల్యాణ్‌ వత్తాసు పలుకుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సంప్రదాయం కాదని, ఆ మాటలను ఖండిస్తున్నామని ఎందుకు చెప్పట్లేదు? దాడిని భాజపా నాయకుడు సోము వీర్రాజు ఖండించడంలో తప్పులేదు.. గానీ భాషను ఖండించాల్సిన బాధ్యత జాతీయ పార్టీగా లేదా?’ అని బొత్స ప్రశ్నించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని