ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: సజ్జల

ప్రధానాంశాలు

ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: సజ్జల

ఈనాడు, అమరావతి: భవిష్యత్తులో ఇలాంటి మాటలు అంటే స్పందన తీవ్రంగా ఉంటుందని రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ‘బూతులు తిడుతూ రెచ్చగొడుతున్నారు. చీము, నెత్తురు ఉన్నవారు స్పందించకుండా ఎలా ఉంటారు?’ అని ప్రశ్నించారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘సీఎంను బూతులు తిట్టినవారిని నిలదీసేందుకే ఆయన అభిమానులు తెదేపా కార్యాలయానికి వెళ్లి ఉంటారు. వారికి అభిమానం తప్ప వేరేది తెలియదు. సీఎంపై బూతులు మాట్లాడించినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రిపై పట్టాభి వాడిన పదానికి అర్థం చెప్పి, ఆ పదాన్ని ఎవరు ఎవరినైనా అనవచ్చని చంద్రబాబు దీక్షకు కూర్చునే ముందు చెబితే బాగుంటుంది. ఎస్‌ఈబీతో రెండేళ్లలోనే 2.51 లక్షల కేజీల గంజాయిని సీజ్‌ చేశారు’ అని చెప్పారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని