ఏడేళ్లుగా కేసీఆర్‌ ఆడిందే ఆట: షర్మిల

ప్రధానాంశాలు

ఏడేళ్లుగా కేసీఆర్‌ ఆడిందే ఆట: షర్మిల

తెలంగాణలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుటుంబ సంక్షేమం చూసి మురిసిపోతున్న కేసీఆర్‌ పాలనను అంతం చేయడానికే ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టా. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చి సొంత జేబులు నింపుకొంటున్నారు. నిరుద్యోగుల ఆశలు చిదిమేసి వారిని ఆత్మహత్యల దిశగా పురిగొల్పుతున్నారు. ఈ విధంగా సాగుతున్న కేసీఆర్‌ కుటుంబ పాలనను సమాప్తం చేయడానికే పాదయాత్ర చేస్తున్నా’’ అని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పేరిట బుధవారం తెలంగాణలోని చేవెళ్ల నుంచి ఆమె చేపట్టిన పాదయాత్రను తల్లి విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని