కాలిస్తే కాల్చుకోండి.. నేను నిరసన తెలపాల్సిందే: బుద్దా వెంకన్న

ప్రధానాంశాలు

కాలిస్తే కాల్చుకోండి.. నేను నిరసన తెలపాల్సిందే: బుద్దా వెంకన్న

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను బంద్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు పోలీసులు ఉదయాన్నే ఆయన నివాసానికి చేరుకున్నారు. బయటికి వెళ్లడానికి అనుమతించకపోవడంతో పోలీసులపై వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాలిస్తే కాల్చుకోండి.. నేనుమాత్రం వైకాపా అరాచకాలపై నిరసన తెలిపేందుకు బయటకు వెళ్లాల్సిందే’ అని తేెల్చిచెప్పారు. చొక్కా గుండీలు విప్పేసి బయటకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆయన్ను అడ్డుకుని జీపు ఎక్కించబోగా తెదేపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు  వెంకన్నను అరెస్ట్‌ చేసి, వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆయన బనియన్‌తోనే నిరసన తెలిపారు. సాయంత్రం ఆయన్ను విడుదల చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని