హక్కుల ఉల్లంఘన కింద పోలీసులపై చర్యలు తీసుకోవాలి

ప్రధానాంశాలు

హక్కుల ఉల్లంఘన కింద పోలీసులపై చర్యలు తీసుకోవాలి

లోక్‌సభ స్పీకర్‌కు  రామ్మోహన్‌ నాయుడి లేఖ

ఈనాడు, దిల్లీ: శాంతియుతంగా విలేకర్లతో మాట్లాడుతుండగా తనను చేయిపట్టి లాగి, విలేకర్లను నెట్టేసిన పోలీసులపై హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని తెదేపా లోక్‌సభాపక్ష నేత కె.రామ్మోహన్‌ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు బుధవారం లేఖ రాశారు. ‘మా పార్టీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా బంద్‌లో పాల్గొన్నాం. పోలీసులు బంద్‌ను విఫలం చేసేందుకు ప్రయత్నించారు. రెచ్చగొట్టే కార్యక్రమాలేవీ చేపట్టకున్నా నేతలను అరెస్టుచేశారు. నా విషయంలో హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన శ్రీకాకుళం జిల్లా పోలీసుఅధికారులకు నోటీసులిచ్చి వారిపై చర్యలు తీసుకోవాలి’ అని ఆయన స్పీకర్‌ను కోరారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని