తెదేపాలో చేరిన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి

ప్రధానాంశాలు

తెదేపాలో చేరిన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి

ఈనాడు, అమరావతి: ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి బుధవారం తెదేపాలో చేరారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆయన మెడలో పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవీ రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు అభివృద్ధిని కోరుకునే వ్యక్తికాగా, జగన్‌ వినాశనాన్ని కోరుకుంటారని తెలిపారు. రాష్ట్రానికి మరింత నష్టం జరగకూడదంటే, చంద్రబాబును బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో క్రియాశీలక పార్టీలో చేరాలనే నిర్ణయంతో తెదేపాలోకి వచ్చినట్లు పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని