మేడికొండూరు సీఐ నన్ను కొట్టారు

ప్రధానాంశాలు

మేడికొండూరు సీఐ నన్ను కొట్టారు

న్యాయమూర్తికి తెదేపా నేత బ్రహ్మం చౌదరి ఫిర్యాదు

ఈనాడు, అమరావతి, మంగళగిరి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మేడికొండూరు సీఐ తనను కొట్టారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో గొడవ జరుగుతోందని తెలిసి అక్కడికి వెళ్లిన తనను కులం పేరుతో దూషించి, చంపేందుకు యత్నించారంటూ డీజీపీ కార్యాలయంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ జి.సక్రూనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదయిన కేసులో బ్రహ్మం చౌదరి ఆరో నిందితుడు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి గురువారం మంగళగిరిలోని న్యాయస్థానంలో హాజరుపరిచారు. సీఐ తనను కొట్టారని బ్రహ్మం చౌదరి న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం ఉండవల్లిలో తనను అదుపులోకి తీసుకున్న పోలీసులు మొదట మేడికొండూరు పోలీసుస్టేషన్‌కు, అక్కడి నుంచి విజయపురిసౌత్‌ స్టేషన్‌కు, ఇతర ఠాణాలకు తిప్పి, గురువారం తెల్లవారుజామున మంగళగిరికి తీసుకొచ్చారని చెప్పారు. బ్రహ్మం చౌదరికి నవంబరు 3 వరకూ రిమాండు విధిస్తూ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీ ప్రత్యూష ఆదేశించారు. అనంతరం పోలీసులు ఆయన్ను గుంటూరు సబ్‌జైలుకు తరలించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని